News13th Jul 12:28 PMSunil Byrisetty1 min read

సీఎం చంద్రబాబుకు సచివాలయ సంఘం కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెమో-57 ప్రకారం అర్హులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2004 సెప్టెంబర్ 1కు ముందు విడుదలైన నియామక నోటిఫికేషన్ల ద్వార

సీఎం చంద్రబాబుకు సచివాలయ సంఘం కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెమో-57 ప్రకారం అర్హులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2004 సెప్టెంబర్ 1కు ముందు విడుదలైన నియామక నోటిఫికేషన్ల ద్వారా ఎంపికై, సీపీఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సేవలో చేరిన ఉద్యోగులకు జూలై 13, 2026న విడుదల చేసిన G.O.Ms.No.53 ద్వారా ఓపీఎస్ ప్రయోజనాలు వర్తింపజేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10,715 మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు జి. రామకృష్ణ హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు. ఇది ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌కు ప్రభుత్వం ఇచ్చిన సానుకూల స్పందన అని పేర్కొన్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఈ నిర్ణయం ఊరటనిచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులకు జి. రామకృష్ణ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యను సానుభూతితో పరిశీలించి నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Old Pension Scheme
OPS
AP Government
AP Employees
Secretariat Employees
మెమో 57
జీఓ ఎంఎస్ 53
సీపీఎస్
ఉద్యోగుల సంక్షేమం
Scroll for the next article