Sports10th Aug 04:00 PMSunil Byrisetty1 min read
వాలీబాల్ విజేత AP సెక్రటేరియట్ జట్టు
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (APSPF) ఆధ్వర్యంలో ఇంటర్-జోన్ వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. APSPF ఉన్నతాధికారుల సూచనల మేరకు
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (APSPF) ఆధ్వర్యంలో ఇంటర్-జోన్ వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. APSPF ఉన్నతాధికారుల సూచనల మేరకు ఎయిర్‌పోర్ట్ యూనిట్ అసిస్టెంట్ కమాండెంట్ కె. రమేష్ ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలు జరిగాయి.
టోర్నమెంట్‌ను ముఖ్య అతిథిగా హాజరైన APSPF ఇన్‌స్పెక్టర్ జనరల్ బివి.రామిరెడ్డి ప్రారంభించారు. క్రీడలు సిబ్బందిలో శారీరక, మానసిక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి,నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఇంటర్-జోన్ వాలీబాల్ టోర్నమెంట్‌లో AP సెక్రటేరియట్, AP హైకోర్టు, డా. NTTPS, విజయవాడ గార్డ్స్ మరియు APSPF హెడ్‌క్వార్టర్స్ తదితర యూనిట్లకు చెందిన ఆరు జట్లు పాల్గొన్నాయి. సుమారు 250 మంది క్రీడాకారులు, సిబ్బంది, సందర్శకులు హాజరై పోటీలను వీక్షించారు. పోటీలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగాయి. టోర్నమెంట్‌లో AP సెక్రటేరియట్ జట్టు విజేతగా, విజయవాడ గార్డ్స్ జట్టు రన్నరప్‌గా నిలిచాయి.