News20th Apr 03:13 PMSunil Byrisetty1 min read

సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు కార్డులు అందించే కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన వృద్ధులందరికీ డిజిటల్ కార్డులు అందించాలని నిర్ణయించింది. గ్రామ, వార్డు

సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు కార్డులు అందించే కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన వృద్ధులందరికీ డిజిటల్ కార్డులు అందించాలని నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డు పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల రాయితీ సహా ఇతర సదుపాయాలను ఈ కార్డు ద్వారా పొందవచ్చు. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలకు సీనియర్‌ సిటిజన్‌ కార్డును ప్రభుత్వం జారీ చేస్తుంది. కార్డు కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యాలయంలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ దరఖాస్తు చేసుకున్న రోజే కార్డును ఇస్తారు. సచివాలయాల్లో అప్లై చేసుకున్న వారికి వారంలో కార్డు అందుతుంది. డిజిటల్ కార్డు దరఖాస్తుకు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో, ఆధార్‌ కార్డు, బ్యాంకు అకౌంట్ పాస్ బుక్, బ్లడ్ గ్రూప్, ఆధార్ కార్డు హిస్టరీ, ఇతర ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి.
Senior Citizen Card
AP Schemes
Welfare Schemes
60 ఏళ్లు నిండిన వృద్ధులందరికీ డిజిటల్ కార్డులు
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు
డిజిటల్ కార్డు
Scroll for the next article