News12th Jun 11:30 AMSunil Byrisetty1 min read

ఏపీ సేవా పోర్టల్ పునరుద్ధరణ..

రాష్ట్రవ్యాప్తంగా ఏపీ సేవా పోర్టల్ సర్వీసులను జీఎస్.డబ్ల్యూఎస్ అధికారులు పునరుద్ధరించారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ సేవ పోర్టల్ అప్డేట్ చేసేందుకు నాలు

ఏపీ సేవా పోర్టల్ పునరుద్ధరణ..
రాష్ట్రవ్యాప్తంగా ఏపీ సేవా పోర్టల్ సర్వీసులను జీఎస్.డబ్ల్యూఎస్ అధికారులు పునరుద్ధరించారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ సేవ పోర్టల్ అప్డేట్ చేసేందుకు నాలుగురోజుల పాటు జీఎస్.డబ్ల్యూఎస్ శాఖ నిలిపివేసింది. శనివారం ఉదయం నుంచి గ్రామ, వార్డు సచివాల యాల్లో అందించే సేవలు నిలిచిపోయాయి. పనులు పూర్తికావడంతో యధావిధిగా సేవలు పునరుద్ధరణ జరిగింది. దీంతో ఆదాయ ధ్రువీకరణ పత్రం, సమగ్ర ధ్రువీకరణ పత్రం, భూమి మ్యూటేషన్లు, రేషన్, బియ్యం కార్డులు, ఇళ్లు, స్థల పట్టాలు, వృద్ధాప్య ధ్రువీకరణ పత్రాలు, వివాహ ధ్రువీకరణ పత్రాలు, రెవెన్యూ వాటర్ ట్యాక్స్, పట్టణ పరిపాలన సంబంధిత సేవలు, మత్స్యశాఖ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు సేవా పోర్టల్ ను వినియోగించుకోవచ్చని జీఎస్.డబ్ల్యూఎస్ సూచించింది.
Andhra Pradesh news
Ap seva Portal
GSWS officials have restored
ఏపీ సేవా పోర్టల్ సర్వీసులను జీఎస్.డబ్ల్యూఎస్ అధికారులు పునరుద్ధరించారు
యధావిధిగా సేవలు పునరుద్ధరణ
Scroll for the next article