News28th May 09:24 AMSunil Byrisetty1 min read

డేంజర్లో విజయవాడ! శక్తి ఎఫెక్ట్

మే 27న బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన తీవ్ర శక్తీ తుఫాన్ గా మారి ఉరుములు, మెరుపులు, భారీ పిడుగులతో కూడిన ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో ఉన్న అన్ని జిల్లాల్లో

డేంజర్లో విజయవాడ! శక్తి ఎఫెక్ట్
మే 27న బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన తీవ్ర శక్తీ తుఫాన్ గా మారి ఉరుములు, మెరుపులు, భారీ పిడుగులతో కూడిన ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో ఉన్న అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శక్తి తుఫాన్ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై శక్తి తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది. గతేడాది బుడమేరు వాగు పొంగి విజయవాడను ముంచెత్తింది. ఇప్పుడు శక్తి తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల కారణంగా విజయవాడకు ఆనుకుని ఉన్న మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. భారీ వర్షాల సమయంలో ఉప్పొంగి, వరదలు మరియు రాకపోకల అంతరాయాలకు కారణమవుతుంది.
Viajyawada
Telugu States
Weather Updates
Heavy Rain Alert
shakti storm
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన తీవ్ర శక్తీ తుఫాన్
అతి భారీ వర్షాలు
శక్తి తుఫాన్
Scroll for the next article