Sports20th May 01:22 PMSunil Byrisetty1 min read
క్రీడల్లో ఏపీని అగ్రగామిగా నిలబెట్టాలి
క్రీడల్లో ఏపీని అగ్రగామిగా నిలబెట్టి రాష్ట్ర, దేశ కీర్తి ప్రతిష్టతలను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేయాలని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని శా
క్రీడల్లో ఏపీని అగ్రగామిగా నిలబెట్టి రాష్ట్ర, దేశ కీర్తి ప్రతిష్టతలను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేయాలని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో సిలంబమ్(కర్రసాము) క్రీడాకారులు శాప్ ఛైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సిలంబమ్ క్రీడాకారులు మాట్లాడుతూ ఏలూరు జిల్లా కలిదిండిలో ఏప్రిల్ 30వ తేదీన జరిగిన స్టేట్ లెవల్ సిలంబమ్ ఛాంపియన్‌షిప్-2025 పోటీల్లో వారు సాధించిన విజయాలు, పతకాల గురించి శాప్ ఛైర్మన్‌కు వివరించారు.
ఎస్వీఆర్కే ఇండియన్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 73 గోల్డ్ మెడల్స్, 16 సిల్వర్ మెడల్స్, 5 బ్రాంజ్ మెడల్స్ సాధించినట్లు వివరించారు.
ఈ సందర్భంగా వారిని శాప్ ఛైర్మన్ అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, కావాల్సిన క్రీడాసదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు