News19th Jan 04:46 PMSunil Byrisetty1 min read
ఎన్టీఆర్ సేవలు అమోఘం.. 'భారత రత్న' ఇవ్వాలి..
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా నిలబెట్టిన మహనీయుడు ఎన్టీ రామారావుకి కేంద్ర ప్రభుత్వం 'భారత రత్న' పురస్కారాన్ని ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయ
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా నిలబెట్టిన మహనీయుడు ఎన్టీ రామారావుకి కేంద్ర ప్రభుత్వం 'భారత రత్న' పురస్కారాన్ని ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతిని పురస్కరించుకుని సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస తెలుగు వారి ఆహ్వానం మేరకు ఏర్పాటు చేసిన జూమ్ కాన్ఫరెన్స్‌లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఎన్టీఆర్ కేవలం ఒక నటుడిగానే కాకుండా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన దూరదృష్టి గల నేతగా చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. అనంతరం వచ్చే మే నెల 8వ తేదీన బహ్రెయిన్‌లో వైభవంగా నిర్వహించనున్న శ్రీనివాస కల్యాణం మహోత్సవానికి హాజరుకావాల్సిందిగా నిర్వాహకులు అయ్యన్నపాత్రుడుని కోరారు.