News22nd Jan 04:47 PMSunil Byrisetty1 min read

జాతీయ వేదికపై ఏపీ ఎస్ఎస్ఏ నమూనాకు ప్రశంసలు

న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక 'ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సమ్మిట్'లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తనదైన ముద్ర వేసింది. రాష్ట్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రభుత్వం అమలు చేస్తు

జాతీయ వేదికపై ఏపీ ఎస్ఎస్ఏ నమూనాకు ప్రశంసలు
న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక 'ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సమ్మిట్'లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తనదైన ముద్ర వేసింది. రాష్ట్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర, వినూత్న విద్యా సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఈ వేదికపై ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకే పరిమితం కాకుండా, సంపూర్ణమైన 'సమగ్ర విద్యా ఎకోసిస్టమ్'ను నిర్మిస్తోందని వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్ దృష్టి (DRISHTI) ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం రూపొందించిన డిజిటల్ సమగ్ర విద్య నిర్వహణ వ్యవస్థ ద్వారా పారదర్శకమైన సేవలు, PM SHRI పాఠశాలల కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆటిజం సెంటర్లు, డిజిటల్ పరికరాల పంపిణీ, పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు తదితర అంశాలతో పాటు స్క్రైబ్-రహిత పరీక్షల నిర్వహణ, సమగ్ర క్రీడలు, సాహస శిక్షణ కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం వంటి వినూత్న కార్యక్రమాల గురించి వివరించారు.
Andhra Pradesh
SSA
Inclusive Education
Special Needs Children
DRISHTI Project
Digital Education
PM SHRI Schools
ఆటిజం కేంద్రాలు
విద్యా వినూత్నత
జాతీయ సమ్మిట్
విద్యా సంస్కరణలు
Scroll for the next article