News7th Aug 05:34 PMSunil Byrisetty1 min read

ముఖ్యమంత్రికి హజ్ యాత్రికుల కృతజ్ఞతలు

విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని ఎంచుకుని, తక్కువ యాత్రికుల కారణంగా విజయవాడ నుంచి విమాన సర్వీసు రద్దుతో హైదరాబాద్ నుండి హజ్ యాత్రను పూర్తి చేసి ప్రభుత్వ రాయితీని అందుకున్న యాత్రికుల

ముఖ్యమంత్రికి హజ్ యాత్రికుల కృతజ్ఞతలు
విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని ఎంచుకుని, తక్కువ యాత్రికుల కారణంగా విజయవాడ నుంచి విమాన సర్వీసు రద్దుతో హైదరాబాద్ నుండి హజ్ యాత్రను పూర్తి చేసి ప్రభుత్వ రాయితీని అందుకున్న యాత్రికులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను ముస్లిం మత పెద్దలు, ఇమాములు కలిశారు.విజయవాడ ఎంబార్కేషన్ ఎన్నుకున్న హజ్ యాత్రికులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు దృష్టికి తమ కృతజ్ఞతలను తీసుకువెళ్లాలని మంత్రి ఫరూక్ ను వారు కోరారు. విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం ఎన్నుకున్న 72 మంది యాత్రికులకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున ఇచ్చిన హామీ మేరకు రూ.72 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి 24 గంటల వ్యవధిలోనే బ్యాంక్ అకౌంట్లకు జమ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ 2026 హజ్ కి విజయవాడ ఎంబార్కేషన్ ఎన్నుకున్న వారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తామని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు.
Andhra Pradesh
Haj Pilgrims
CM Chandrababu Naidu
Minority Welfare
Vijayawada Embarkation Point
Haj Subsidy
Muslim Leaders
NMD Farooq
మైనారిటీ సంక్షేమ శాఖ
హజ్ యాత్ర
Scroll for the next article