Notifications5th Aug 10:05 AMSunil Byrisetty1 min read
42 ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రాసిక్యూషన్ డిపార్ట్‌మెంట్‌లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. విద్యార్హత: అభ్యర్థి తప్పనిసరిగా ఏదైనా సబ్జెక్టులో బ్
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రాసిక్యూషన్ డిపార్ట్‌మెంట్‌లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది.
విద్యార్హత: అభ్యర్థి తప్పనిసరిగా ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీతో పాటు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీ కలిగి ఉండాలి. ఇంటర్మీడియట్ తర్వాత ఐదేళ్ల లా కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అర్హులేనని తెలిపారు.
అనుభవం: అభ్యర్థి నోటిఫికేషన్ తేదీ (04-08-2025) నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టులలో అడ్వకేట్‌గా కనీసం మూడు (3) సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఉండాలి.
*ఆన్‌లైన్ దరఖాస్తు: 2025 ఆగస్టు 11 నుండి 2025 సెప్టెంబర్ 7 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది.
నోటిఫికేషన్, అప్లికేషన్ కొరకు వెబ్‌సైట్: slprb.ap.gov.in సందర్శించాలి.
ఫీజు: OC మరియు BC అభ్యర్థులకు రూ. 600, SC మరియు ST లకు రూ. 300గా నిర్ణయించారు.