News31st Aug 11:34 AMSunil Byrisetty1 min read

గ్రౌండ్ బుకింగ్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

ఏపీలో స్త్రీ శక్తి పథకం అమలు చేస్తున్న 5 రకాల బస్సుల్లో.. గ్రౌండ్ బుకింగ్ ఉన్నవాటికి కూడా మహిళల ఉచిత ప్రయాణాన్ని అనుమతించేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని బస్సులను కండక్టర్

గ్రౌండ్ బుకింగ్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం
ఏపీలో స్త్రీ శక్తి పథకం అమలు చేస్తున్న 5 రకాల బస్సుల్లో.. గ్రౌండ్ బుకింగ్ ఉన్నవాటికి కూడా మహిళల ఉచిత ప్రయాణాన్ని అనుమతించేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని బస్సులను కండక్టర్లు లేకుండా రెండు, మూడు బస్టాండ్లలో మాత్రమే ఆగేలా నడుపుతున్నారు. అటువంటి బస్సులకు ఆయా బస్టాండ్లలో మాత్రమే టికెట్లు జారీ (గ్రౌండ్ బుకింగ్) చేస్తారు. ఇటువంటి పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్లో మహిళలు ఇక ఉచితంగా ప్రయాణించవచ్చు. తిరుమల ఘాట్ కాకుండా రాష్ట్రమంతటా 39 ఘాట్ రోడ్లపై బస్సులు తిరుగుతున్నాయి. వీటన్నింటిలో మహిళలు ఉచితంగా ప్రయాణించేలా ఆదేశాలిచ్చారు. బొబ్బిలి నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఎక్స్ప్రెస్ బస్సులో సీటు విషయంలో ఓ వ్యక్తి, మహిళ బూతులు తిట్టుకుంటూ ఘర్షణపడ్డారు. ఈ ఘటన ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఆ ఇద్దరిపై కేసు నమోదు చేయనున్నారు.
Andhra Pradesh
APSRTC
Stree Shakti
Free Bus Travel
Women Welfare
Palle Velugu
Ultra Palle Velugu
Express Bus
Free Travel for Women
Ghat Roads
గ్రౌండ్ బుకింగ్ బస్సుల్లో కూడా ఫ్రీ జర్నీ
Scroll for the next article