News5th Oct 02:23 PMSunil Byrisetty1 min read

ప్రధాని మోదీ చేతుల మీదుగా ఏపీ విద్యార్థులకు సత్కారం!

ఏపీ విద్యార్థులు గొప్ప ఘనత సాధించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సత్కారం పొందారు. ఐటీఐ కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానించడంతో పాటు వారికి అవసరమైన అత్యాధునిక సాంకేతిక, ఆచరణాత్మ

ప్రధాని మోదీ చేతుల మీదుగా ఏపీ విద్యార్థులకు సత్కారం!
ఏపీ విద్యార్థులు గొప్ప ఘనత సాధించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సత్కారం పొందారు. ఐటీఐ కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానించడంతో పాటు వారికి అవసరమైన అత్యాధునిక సాంకేతిక, ఆచరణాత్మక శిక్షణను ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. ఫలితంగా మన విద్యార్థులు జాతీయ స్థాయి ఐటీఐ పరీక్షల్లో రాణించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా లాభదాయకమైన ఉపాధి అవకాశాల కోసం పోటీపడుతున్నారు. కూటమి ప్రభుత్వ కృషి కారణంగా ఆల్ ఇండియా ఐటీఐ పరీక్షల్లో వివిధ ట్రేడ్ లకు సంబంధించి 17 మంది రాష్ట్ర విద్యార్థులు టాప్ ర్యాంక్ లు సాధించారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా టాపర్ సర్టిఫికెట్లు అందుకున్నారు.
AP Students
Narendra Modi
ITI Achievements
Skill Development
Modern Training
National ITI Exams
Top Rankers
All India ITI Results
Employment Opportunities
విద్యార్థి గుర్తింపు
సాంకేతిక విద్య
ప్రధాన మంత్రి అవార్డులు
Scroll for the next article