News18th Sep 04:21 PMSunil Byrisetty1 min read
2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూ యువతకు బంగారు పునాదులు వేస్తున్నామని మంత్రి ఎస్.సవిత తెలిపారు. తమ
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూ యువతకు బంగారు పునాదులు వేస్తున్నామని మంత్రి ఎస్.సవిత తెలిపారు. తమది జెన్ జీ ప్రభుత్వమని, చదువుకున్న యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. నైపుణ్యం పోర్టల్ ను ఏర్పాటు చేసి, అందులో నిరుద్యోగ యువతకు అవసరమయ్యే ఉద్యోగావకాశాలు, స్కిల్ పెంచుకునే వివరాలు పొందుపర్చామన్నారు. యువశక్తితో 2047 నాటికి ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామని ధీమా వ్యక్తంచేశారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఆమె తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. చదువులు పూర్తికాగానే యువతకు ఉద్యోగాలు లభించేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. కేవలం రెండేళ్ల కాలంలో ఏపీకి రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పరిశ్రమలు ఏర్పాటు చేసి, స్థానికంగానే ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకొంటున్నారని మంత్రి సవిత తెలిపారు. యువతకు ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని మంత్రి సవిత తెలిపారు.