News8th Jun 01:08 PMSunil Byrisetty1 min read

ఏపీ చరిత్రలో తొలిసారి.. పదోన్నతుల్లో రికార్డ్!

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. కేవలం సర్వీసునే ప్రామా

ఏపీ చరిత్రలో తొలిసారి.. పదోన్నతుల్లో రికార్డ్!
ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. కేవలం సర్వీసునే ప్రామాణికంగా తీసుకుంటుని ఆన్‌లైన్ విధానంలో చేపడుతున్నారు. పైరవీలకు, రాజకీయ జోక్యానికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా, ఆన్‌లైన్ ద్వారా 4,853 పదోన్నతులు, 35,235 బదిలీలను విజయవంతంగా పూర్తి చేసినట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉపాధ్యాయ సంఘాల సూచనలు పరిగణనలోకి తీసుకుని, "టీచర్ ట్రాన్స్‌ఫర్స్ యాక్ట్"ను అమల్లోకి తెచ్చింది. గతంలో మాన్యువల్ కౌన్సెలింగ్‌లో ఖాళీల వివరాలు వెంటనే తెలియక సీనియర్లు నష్టపోవడం, రోజుకు కొద్దిమందికే కౌన్సెలింగ్ సాధ్యమవడం, సుదూర ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి వేచి చూడాల్సిన ఇబ్బందులు వంటి సమస్యలుండేవి. ఆన్‌లైన్ విధానంతో ఇలాంటివి జరగకుండా చూడటంతోపాటు సమయం, శ్రమలను ఆదా చేసి, సీనియారిటీకి న్యాయం చేస్తోంది.
Andhra Pradesh news
Education Department
ap teachers transfer
teacher promotions
manual counseling
ఉపాధ్యాయుల బదిలీలు
ఆన్లైన్ ద్వారా 4
853 పదోన్నతులు
Scroll for the next article