Education19th Dec 11:36 AMSunil Byrisetty1 min read

ఏపీ టెట్ ప్రాథమిక కీ విడుదల

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీటెట్)- 2025కు సంబంధించి అప్డేట్ వచ్చింది. టెట్ లో భాగంగా నిర్వహించిన పేపర్-2 ఏ పరీక్షల ప్రాథమిక కీ విడుదల చేసినట్లు ఏపీ టెట్ కన్వీనర్ ఎం. వెంకటకృష్ణ

ఏపీ టెట్ ప్రాథమిక కీ విడుదల
ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీటెట్)- 2025కు సంబంధించి అప్డేట్ వచ్చింది. టెట్ లో భాగంగా నిర్వహించిన పేపర్-2 ఏ పరీక్షల ప్రాథమిక కీ విడుదల చేసినట్లు ఏపీ టెట్ కన్వీనర్ ఎం. వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ఈనెల 10న ఉదయం, మధ్యాహ్నం జరిగిన పేపర్-2ఎ తెలుగు భాష పరీక్ష, 11న ఉదయం నిర్వహించిన పేపర్-2 మైనర్ లాంగ్వేజ్ పరీక్షల ప్రాథమిక కీని అభ్యర్థులు టెట్ అధికారిక వెబ్సైట్ https://tet2dsc.apcfss.in లో పొందవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 24 వరకు అభ్యర్థులు తమ లాగిన్తో ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయవచ్చని సూచించారు.
AP TET
Teacher Eligibility Test
TET 2025
Paper-2 Preliminary Key
Education Department AP
Exam Updates
Candidate Information
Scroll for the next article