Education22nd Jul 04:45 PMSunil Byrisetty1 min read

రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాలు

ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో పది కొత్త మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించామని, వచ్చే విద్యా సంవత్సరంలో మరిన్ని బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయబోతు

రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాలు
ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో పది కొత్త మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించామని, వచ్చే విద్యా సంవత్సరంలో మరిన్ని బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి ఎస్.సవిత తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థల సీట్ల కంటే ఎంజేపీ గురుకులాల సీట్లకే డిమాండ్ ఎక్కువ ఉందన్నారు. తమ ఇళ్ల ముందు రోడ్లు కూడా వేసుకోని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీల విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందన్నారు. బీసీ బిడ్డలకు నాణ్యమైన విద్య, ఆహారం, రక్షణ కల్పిస్తోందన్నారు. బీసీ గురుకులాలు, హాస్టళ్లలో సీసీ కెమెరాలు, ఆర్వో ప్టాంట్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తరగతి గదులు, విశ్రాంతి గదుల్లో దోమలు చొరబడకుండా దోమ తెరలు ఏర్పాటు చేశామన్నారు. రుచికరమైన భోజనం అందించేలా సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.
Andhra Pradesh
BC Gurukul Schools
Mahatma Jyotirao Phule Gurukuls
BC Welfare
Minister Savitha
గురుకుల విద్య
సీసీ కెమెరాలు
ఆర్వో ప్లాంట్లు
ఇన్వర్టర్లు
సన్నబియ్యం
Scroll for the next article