Education9th Jul 01:04 PMSunil Byrisetty1 min read
రెసిడెన్షియల్ స్కూళ్లలో నెట్‌జీరో విధానం
పేద విద్యార్థులకు మెరుగైన విద్య, సంక్షేమం అందించేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థ
పేద విద్యార్థులకు మెరుగైన విద్య, సంక్షేమం అందించేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన సదుపాయాలు కల్పించడంతో పాటు డైట్ ఛార్జీలను 10 శాతం పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ పెంపు ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. హాస్టళ్ల స్థానంలో గురుకులాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, రెసిడెన్షియల్ స్కూళ్లలో నెట్‌జీరో విధానం అమలు చేస్తామని పేర్కొన్నారు. ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు ఎక్సలెన్సీ సెంటర్లను 3 నుంచి 12కి పెంచామని వెల్లడించారు. హాస్టళ్లు, గురుకులాల నిర్వహణకు రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణ కోసం ప్రత్యేక వైద్య విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.