News30th Jul 05:03 PMSunil Byrisetty1 min read

2.50 లక్షల మందికి ఉచిత కళ్లజోళ్లు

పిల్లల్లో చూపు సమస్యలను కూడా ముందుగానే గుర్తించేందుకు ఈ ఏడాది ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 43.30 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక

2.50 లక్షల మందికి ఉచిత కళ్లజోళ్లు
పిల్లల్లో చూపు సమస్యలను కూడా ముందుగానే గుర్తించేందుకు ఈ ఏడాది ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 43.30 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వారిలో చూపు సమస్యలున్న వారిని గుర్తించి అవసరమైన చికిత్సతో పాటు 2.50 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లజోళ్లు అందించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.7 కోట్లు కేటాయించిందన్నారు. తమకు చూపు సరిగా లేదనే విషయాన్ని చాలామంది పిల్లలు బయటకు చెప్పుకోలేరని మంత్రి పేర్కొన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు బోర్డుపై రాసినది కనిపించకపోవడంతో చదువులో వెనుకబడే పరిస్థితి ఏర్పడవచ్చన్నారు. అలాంటి పిల్లలను చదువులో బలహీనులుగా భావించే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు. అందుకే పాఠశాలకే వైద్య బృందాలను పంపించి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్లజోళ్లు అందించడం ద్వారా చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
Andhra Pradesh
Satya Kumar
School Students
Eye Screening
Free Eyeglasses
Student Health
School Health Programme
విద్యార్థుల ఆరోగ్యం
ప్రజారోగ్యం
ప్రభుత్వ పథకం
విద్యాశాఖ
Scroll for the next article