News23rd Jul 12:21 PMSunil Byrisetty1 min read

జిల్లాకు ఒక ఆర్ఎస్కే

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్‌ సేవాకేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చెప్పారు. రాష్ట్రవ్యాప్త

జిల్లాకు ఒక ఆర్ఎస్కే
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్‌ సేవాకేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 297 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలుంటే.. జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాటివల్ల డాక్యుమెంట్‌ రైటర్ల వృత్తికి నష్టం కలగదని మంత్రి స్పష్టం చేశారు. ‘వీఎఫ్‌ఎక్స్‌ గ్లోబల్‌ అనే సంస్థ మహారాష్ట్రలో 60 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో సేవా కేంద్రాలను నిర్వహిస్తోందని తెలిపారు. దీనిపై అధ్యయనం చేసి, ఆంధ్రాలో ఏర్పాటు చేస్తున్నాని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 2019లో వాలంటీర్లను నియమించినప్పుడు.. వారికి రూ.69 కోట్లతో శిక్షణ ఇచ్చేందుకు ఇదే కంపెనీని ఎంపిక చేశారని గుర్తు చేశారు. ఇప్పుడేమో ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని, వైసీపీ రాజకీయ దిగజారుడుతనానికి ఇది నిదర్శనమని మంత్రి వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Registration Service Centres
RSK
Anagani Satya Prasad
Revenue Department
Stamps and Registration
డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్
ప్రజా సేవలు
ఏపీ ప్రభుత్వం
డాక్యుమెంట్ రైటర్లు
Scroll for the next article