News30th Jul 09:03 AMSunil Byrisetty1 min read
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి
రాష్ట్ర, కేంద్ర విభాగాలు సమన్వయంతో పనిచేసి ఎపిని గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి రెండ
రాష్ట్ర, కేంద్ర విభాగాలు సమన్వయంతో పనిచేసి ఎపిని గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి రెండవ త్రైమాసిక NCORD సమావేశం సచివాలయంలో జరిగింది. సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకంగా(EAGLE) ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ను ఏర్పాటు చేయగా అది విజయవంతంగా పనిచేస్తోందని కొనియాడారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగును పూర్తిగా నియంత్రించేందుకు పెద్దఎత్తున సాంకేతికతను వినియోగించి చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. గంజాయి సాగుకు బదులుగా ఆ ప్రాంతంలోని గిరిజనులకు కాఫీ, సిల్వర్ ఓక్ వంటి మొక్కలను అందించి వారి జీవనోపాధిని మెరుగుపర్చేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇటీవల గుంటూరులో గంజాయి,మాదకద్రవ్యాల నియంత్రంపై నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న కార్యక్రమంలో 10వేల మందికి పైగా యువత ప్రజలు పాల్గొని వాటికి దూరంగా ఉంటామని ప్రతిజ్ణ చేశారని గుర్తు చేశారు.