Spiritual17th Oct 03:54 PMSunil Byrisetty1 min read
కార్తీక మాసం ప్రత్యేక టూర్ ప్యాకేజ్
కార్తీక మాసం సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పంచారామాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ కృష్ణ చైతన్య శుక్రవా
కార్తీక మాసం సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పంచారామాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ కృష్ణ చైతన్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచారామాలు (ఐదు పురాతన శివాలయాలు) గొప్ప మత,సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తాయని, కార్తీక మాసంలో ఈ దేవాలయాలను సందర్శించడం అపారమైన దైవిక ఆశీర్వాదాలను ఇస్తుందని భక్తులు నమ్ముతారన్నారన్నారు. భక్తులకు సురక్షిత, సౌకర్యవంతమైన మరియు ఆధ్యాత్మిక, సంతృప్తికర తీర్థయాత్రను అందించడానికి పర్యాటక శాఖ ప్రత్యేక టూర్ ప్యాకేజీలో శ్రీ అమరలింగేశ్వర స్వామి- అమరావతి, సోమేశ్వర స్వామి- భీమవరం, క్షీరారామలింగేశ్వర స్వామి- పాలకొల్లు, భీమేశ్వర స్వామి- ద్రాక్షారామం, కుమారరామ స్వామి, -సామర్లకోట పంచారామ క్షేత్రాలు ఉన్నాయన్నారు.
కార్తీకమాసంలో ప్రతి సోమవారం విజయవాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న టూరిజం కేంద్ర రిజర్వేషన్ కార్యాలయం నుంచి ఈ నెల అక్టోబర్ 27, నవంబర్ 03, నవంబర్ 10, నవంబర్ 17 సోమవారం తేదీల్లో బస్సులు బయలుదేరతాయన్నారు. పెద్దలకు: రూ.2130/, పిల్లలు: రూ.1760 లు ధర ఉంటుందన్నారు. బుకింగ్‌ల కోసం, www.tourism.ap.gov.in, ఇతర వివరాలకు 98480 07025, 84990 54422 & 1800 42545454 పర్యాటక శాఖ డివిజనల్ మేనేజర్ కృష్ణ చైతన్య ఆ ప్రకటనలో తెలియజేశారు.