News7th Nov 03:46 PMSunil Byrisetty1 min read
భవిష్యత్తు పర్యాటకానిదే
భవిష్యత్తు అంతా పర్యాటకానిదే అని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. లండన్ లో వరల్డ్ ట్రావెల్ మార్కెట్ -2025 ప్రదర్శన ముగిసిన అనంతరం ఇండియన్ హై కమిషన్ ఏర్పాటు చేసిన హైటీ కార్యక్రమం
భవిష్యత్తు అంతా పర్యాటకానిదే అని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. లండన్ లో వరల్డ్ ట్రావెల్ మార్కెట్ -2025 ప్రదర్శన ముగిసిన అనంతరం ఇండియన్ హై కమిషన్ ఏర్పాటు చేసిన హైటీ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ప్రసంగించారు. డబ్ల్యూటీఎం ప్రదర్శనలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఇది రాష్ట్ర పర్యాటకానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు మంచి వేదికగా ఉపయోగపడిందని తెలిపారు. ఈ సందర్భంగా డబ్ల్యూటీఎం సదస్సుకు వచ్చిన అంతర్జాతీయ పర్యాటక ప్రతినిధులను మంత్రి కందుల దుర్గేష్ ఏపీకి ఆహ్వానించారు. ఏపీ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఉందని, నూతన పర్యాటక పాలసీని విడుదల చేశామని తెలుపుతూ ఏపీకి రండి... స్థానిక పర్యాటక ప్రదేశాలను సందర్శించండి.. పర్యాటక, ఆతిధ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఏపీ పర్యాటక అభివృద్ధికి దోహదపడండి అని మంత్రి కందుల దుర్గేష్ ఇన్వెస్టర్లను కోరారు.