News6th Oct 11:34 AMSunil Byrisetty1 min read
స్పెయిన్ కు పర్యాటక మంత్రి కందుల దుర్గేష్
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్ లో పర్యటించనున్నారు. అక్టోబర్ 6 నుంచి 8 వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. స్పెయిన్ లోని 'సెవిల్లె-ఫిబెస్'లో జరగనున్న 'టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్ లో పర్యటించనున్నారు. అక్టోబర్ 6 నుంచి 8 వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. స్పెయిన్ లోని 'సెవిల్లె-ఫిబెస్'లో జరగనున్న 'టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ -2026'లో మంత్రి పాల్గొననున్నారు. పర్యాటక రంగంలో నూతన ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతికత, సుస్థిర అభివృద్ధిపై జరిగే చర్చలో పాల్గొంటారు. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి, పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరించి.. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు. డిజిటల్ టూరిజం నుంచి స్మార్ట్ డెస్టినేషన్స్ దాకా.. ఏపీ పర్యాటక భవిష్యత్తును తనదైన శైలిలో మార్చేందుకు కృషి చేస్తున్నారు.