Sports17th Sep 03:14 PMSunil Byrisetty1 min read

క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం

క్రీడల ద్వారా రాష్ట్ర సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇండియా ఖేలో పుట్ బాల్ తో ఏపీ పర్యాటక శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుందని, ఇదొక మైలురాయిగా ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట పేర్క

క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం
క్రీడల ద్వారా రాష్ట్ర సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇండియా ఖేలో పుట్ బాల్ తో ఏపీ పర్యాటక శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుందని, ఇదొక మైలురాయిగా ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్రస్థాయి యువ ప్రతిభను వెలికితీయడం, సాధికారత కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఇండియా ఖేలో ఫుట్‌బాల్ (IKF)తో కలిసి "టైగర్ IKF స్కౌట్ ఆన్ వీల్స్" కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట పర్యవేక్షణలో 45 రోజులపాటు ఫుట్‌బాల్ రోడ్‌షో జరుగనుంది. విశాఖపట్నం, రాజమండ్రి, సత్తెనపల్లి, విజయవాడ, కర్నూలు, అనంతపురం, తిరుపతి వంటి ఏడు ప్రధాన నగరాలకు చేరుకోనున్న రోడ్ షోలో పదికి పైగా చిన్న పట్టణాల్లో ఫుట్‌బాల్ ట్రయల్స్, క్లినిక్స్, పేరెంట్ వర్క్‌షాప్‌లు, బాలికలకు సాధికారత కల్పించే సెషన్స్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎండీ ఆమ్రపాలి పర్యాటక శాఖ ద్వారా తన సహకారాన్ని అందించనుంది. తద్వారా పర్యాటక రంగానికి ప్రచారం కూడా లభిస్తుందని తాము భావిస్తున్నామన్నారు.
Andhra Pradesh
APTDC
Sports tourism
Football
Youth empowerment
IKF
Tiger IKF
Road Show
Cultural Promotion
Football Trials
Skill development
పర్యటన క్రీడలు
ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకం
కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్
Scroll for the next article