News29th Nov 04:21 PMSunil Byrisetty1 min read
ఉర్దూ అకాడమీకి పునర్వైభవం తెస్తాం
ఉర్దూ అకాడమీలో ఉద్యోగం చేసి జీతాలు తీసుకునే వారికి ప్రాధాన్యం ఇస్తామని, పని చేయకుండా కేవలం గౌరవ వేతనాలు పొందే వారిని ఉపేక్షించబోమని ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ మొహమ్మద్ ఫరూక్
ఉర్దూ అకాడమీలో ఉద్యోగం చేసి జీతాలు తీసుకునే వారికి ప్రాధాన్యం ఇస్తామని, పని చేయకుండా కేవలం గౌరవ వేతనాలు పొందే వారిని ఉపేక్షించబోమని ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ మొహమ్మద్ ఫరూక్ షుబ్లి స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన బాధ్యతాయుతమైన చైర్మన్ పదవికి పూర్తి న్యాయం చేస్తానన్నారు. గతంలో ఎవరూ అడగలేదు కాబట్టి, పని చేయలేదని చెబితే ఊరుకునేది లేదని, ఏ విభాగంలో లేని విధంగా 159 మంది ఉద్యోగులు ఉర్దూ అకాడమీలో ఉన్నారని, వీరందరినీ సద్వినియోగం చేసుకునేలా శ్రమిస్తానని పేర్కొన్నారు. పని చేసిన వారికి గుర్తింపు కూడా అదే విధంగా లభిస్తుందన్నారు. రాష్ట్రంలో 2022లో జారీ చేసిన జీవో ప్రకారం ఉర్దూ రెండో అధికార భాషగా ఉన్నందున ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసే బోర్డుల్లో ఉర్దూ వినియోగం ఉండేలా చూస్తామన్నారు. ఆయా నగరాల్లో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కనిపించే ‘ఐ లవ్ ఆంధ్రప్రదేశ్’ వంటి బోర్డులను ఉర్దూ పదాల్లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరాన్ని బట్టి ఉర్దూ అనువాదకులను అందుబాటులో ఉంచుతామని షుబ్లి పేర్కొన్నారు. మదరసా మోడరనైజేషన్ కింద ఉర్దూ భాష అభివృద్ధికి అకాడమీ కృషి చేస్తుందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కింద ఉర్దూలో డీటీపీ నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తామని షుబ్లి వివరించారు.