News24th Jun 12:02 PMSunil Byrisetty1 min read
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్డేట్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్డేట్ ఇచ్చింది. ఉద్యోగులు బదిలీపై సొంత మండలానికి వెళ్లకూడదనే నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ఉద్యోగులు సొంత వార్డులో కాక
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్డేట్ ఇచ్చింది. ఉద్యోగులు బదిలీపై సొంత మండలానికి వెళ్లకూడదనే నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ఉద్యోగులు సొంత వార్డులో కాకుండా ఆ పట్టణంలోనే ఇతర వార్డులు, ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు బదిలీపై వెళ్లేందుకు అర్హులని తెలిపింది. అటు తమకూ ఇదే తరహా అవకాశం ఇవ్వాలని, ఒకే శాఖలోని ఉద్యోగులకు రెండు రకాల నిబంధనలు సరికాదని గ్రామ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు ఒక రకంగా, గ్రామ సచివాలయ ఉద్యోగులకు మరో రకంగా ఉండటం సరికాదని, ప్రభుత్వం పున:పరిశీలన చేయాలని కోరుతున్నారు.