News7th Sep 05:35 PMSunil Byrisetty1 min read
ఏపీ వక్ఫ్ బోర్డు డిజిటల్ పాలనలో మరో ముందడుగు
ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డును ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక ముందడుగు పడిందని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. బోర
ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డును ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక ముందడుగు పడిందని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. బోర్డు సేవలు, కార్యకలాపాలను డిజిటలైజ్ చేసేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్, మొబైల్ యాప్ రూపొందించామని, త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో సీఈఓ యాకూబ్ ఖాజీ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ ఆడిటర్లు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో చైర్మన్ అబ్దుల్ అజీజ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని సందేశం అందించారు. కొత్త వ్యవస్థను ప్రారంభించడం ఒక్కటే కాదని, దాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ డిజిటల్ మార్పులో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర కీలకమన్నారు. అధికారిక ప్రారంభానికి ముందే సిబ్బందిని కొత్త వ్యవస్థ వినియోగానికి సిద్ధం చేస్తున్నామని, తద్వారా పరిపాలనలో పారదర్శకత, వేగం, జవాబుదారీతనం మరింత పెరుగుతాయని పేర్కొన్నారు.