Business Type22nd Aug 09:37 AMSunil Byrisetty1 min read

లాజిస్టిక్స్ హబ్ ఆఫ్ ఇండియాగా ఏపీ

ఆంధ్రప్రదేశ్ ను సముద్ర వాణిజ్యంలో తూర్పుతీర గేట్ వే గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. అంతర్జాతీయ షిప్పింగ్ లాజిస్టిక్స్, పోర్టుల నిర

లాజిస్టిక్స్ హబ్ ఆఫ్ ఇండియాగా ఏపీ
ఆంధ్రప్రదేశ్ ను సముద్ర వాణిజ్యంలో తూర్పుతీర గేట్ వే గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. అంతర్జాతీయ షిప్పింగ్ లాజిస్టిక్స్, పోర్టుల నిర్వహణ లో అగ్రశ్రేణి కంపెనీ ఏపీ మోలర్ మేర్క్స్ అనుబంధ సంస్థ ఏపిఎం టెర్మినల్స్ రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధికి ఏపీ మారి టైమ్ బోర్డుతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రూ. 9 వేల కోట్ల పెట్టుబడితో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలను ఏపీఎం టెర్మినల్స్ కల్పించనుంది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ మారిటైమ్ బోర్డు- ఏపీఎం టెర్మినల్స్ సంస్థలు ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ పోర్టుల్లో ఆధునిక టెర్మినల్స్, కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి నిర్వహణను చేపట్టనుంది. తద్వారా ప్రత్యక్షంగా 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉంది.
Andhra Pradesh ports
Ramayapatnam port
Machilipatnam port
Mulapeta port
APM Terminals
Maersk
Maritime trade
Port development
Chandrababu Naidu
లాజిస్టిక్స్ హబ్ ఆఫ్ ఇండియాగా ఏపీ
ఏపీ మారిటైమ్ బోర్డు
షిప్పింగ్ లాజిస్టిక్స్
Scroll for the next article