News11th Aug 03:58 PMSunil Byrisetty1 min read
బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం
వరకట్న వేధింపులకు బలైన పల్లికొండ శ్రీవిద్య ఆత్మకు శాంతి చేకూర్చేలా కుటుంబ సభ్యులకు పూర్తి న్యాయం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ భరోసా ఇచ్చారు.
వరకట్న వేధింపులకు బలైన పల్లికొండ శ్రీవిద్య ఆత్మకు శాంతి చేకూర్చేలా కుటుంబ సభ్యులకు పూర్తి న్యాయం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ భరోసా ఇచ్చారు. వరకట్న వేధింపులకు ఉయ్యూరులో అత్త వారింటి వద్ద ఈ నెల మూడవ తేదీన మరణించిన పల్లికొండ శ్రీవిద్య వారి కుటుంబ సభ్యులను మొవ్వ మండలం, కొండవరం గ్రామంలో వారి గృహం వద్ద పరామర్శించి, జరిగిన సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపట్టి నిందితులకు కఠిన శిక్షపడేలా బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో రాష్ట్ర మహిళా కమిషన్ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. తమ కుమార్తె చనిపోయేంత పిరికిది కాదని, పూర్తి విచారణ చేపట్టి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కోరారు.