News14th Aug 03:13 PMSunil Byrisetty1 min read

చిన్నారుల కోసం ఓ చిన్న ప్రపంచం

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కార్యాలయంలో చిన్నారుల కోసం ప్లే ఏరియా, చిల్డ్రన్స్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. కుటుంబ సమస్యలు, కౌన్సెలింగ్‌ కోసం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కార్యాలయానికి తల్

చిన్నారుల కోసం ఓ చిన్న ప్రపంచం
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కార్యాలయంలో చిన్నారుల కోసం ప్లే ఏరియా, చిల్డ్రన్స్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. కుటుంబ సమస్యలు, కౌన్సెలింగ్‌ కోసం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కార్యాలయానికి తల్లిదండ్రులతో పాటు చిన్నారులు కూడా వస్తుంటారు. ఈ సమయంలో కుటుంబ వివాదాలు, వాదోపవాదాల ప్రభావం చిన్నారులపై పడకుండా వారికి సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఈ ప్లే ఏరియా ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తల్లిదండ్రులు కౌన్సెలింగ్‌లో పాల్గొనే సమయంలో చిన్నారులు ఆటలు ఆడుతూ, పుస్తకాలు చదువుతూ సంతోషంగా సమయం గడిపేలా ఈ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆటల ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం, శారీరక చురుకుదనం, సృజనాత్మకత పెంపొందడంతో పాటు, చిల్డ్రన్స్ లైబ్రరీ ద్వారా చదువుపై ఆసక్తిని పెంచేలా పుస్తకాలు, డ్రాయింగ్ మరియు కలరింగ్ పుస్తకాలు, పజిల్స్, ఆట వస్తువులను అందుబాటులో ఉంచారు.
AP Women’s Commission
Children’s Play Area
Children’s Library
Child Friendly Space
Andhra Pradesh
Child Welfare
పిల్లల ఆటలు
పుస్తక పఠనం
సృజనాత్మకత
పిల్లల భద్రత
తల్లిదండ్రులు
కౌన్సెలింగ్
Scroll for the next article