News10th Oct 03:37 PMSunil Byrisetty1 min read

త్వరలో మహిళా కమిషన్ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు

ఆడ మగ సమానత్వంపై తల్లిదండ్రులు పెంపకంలోనే చూపాలని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ అన్నారు. మహిళల సమానత్వం పై విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇటీవల ప్రస్తావించడం అభినందనీయమని

త్వరలో మహిళా కమిషన్ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు
ఆడ మగ సమానత్వంపై తల్లిదండ్రులు పెంపకంలోనే చూపాలని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ అన్నారు. మహిళల సమానత్వం పై విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇటీవల ప్రస్తావించడం అభినందనీయమని చెప్పారు. మహిళలకు పెద్దపీట వేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ ముందడుగులోనే ఉన్నారన్నారు. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ప్రతి కాలేజీలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని, ఐసీసీ కంప్లైంట్ సెల్ ను ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నామని వివరించారు. పోక్సో చట్టంపై అవగాహన కల్పించే దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తామని, మహిళలకు సోషల్ సెక్యూరిటీ పెంచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితులకు అందుబాటులో త్వరలో ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని శైలజ తెలిపారు.
Andhra Pradesh
Women’s Commission
Rayapati Shailaja
Nara Lokesh
Chandrababu Naidu
Women Empowerment
Gender Equality
POCSO Awareness
ICC Complaint Cell
Women Safety
Online Counselling
AP Government
Education Awareness
Women Helpline
Scroll for the next article