News10th Jul 05:58 PMSunil Byrisetty1 min read
200 మంది ముస్లిం విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య
నెల్లూరు నగరంలోని జెండా వీధిలో గల పిఎన్ఎం జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్
నెల్లూరు నగరంలోని జెండా వీధిలో గల పిఎన్ఎం జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించారు. తల్లిదండ్రులు ఆయన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను అధికారులను ఆదేశించారు. కాలేజీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వారి వేతనాల సమస్యను అబ్దుల్ అజీజ్ కు తెలిపారు. తక్షణమే మంత్రి నారాయణ, అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అజీజ్ మాట్లాడుతూ, గురు పౌర్ణమి లాంటి శుభదినం నాడు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రారంభించాలని లొకేషన్ నిర్ణయించారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో టెక్నాలజీ తీసుకురాబోతున్నామని డిజిటల్ క్లాస్ రూమ్ చేయబోతున్నామని అన్నారు. ఏపీ వక్ఫ్ బోర్డు తరపున వచ్చే అకడమిక్ ఇయర్‌కి 200 మంది ఇంటర్మీడియట్ ముస్లిం విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ రెసిడెన్షియల్ విద్య అందిస్తామని తెలిపారు.