News23rd Mar 12:18 PMSunil Byrisetty1 min read
వైసిపి ఆధ్వర్యంలో 26వ తేదిన ఇఫ్తార్ విందు
రంజాన్ పండుగ సందర్భంగా వైసిపి ఆధ్వర్యంలో ఈ నెల 26న ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైసిపి అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి అధినేత, మాజీ
రంజాన్ పండుగ సందర్భంగా వైసిపి ఆధ్వర్యంలో ఈ నెల 26న ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నట్లు
ఎన్టీఆర్ జిల్లా వైసిపి అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో
వైసిపి అధినేత, మాజీ సీఎం జగన్ పాల్గొంటారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ Nac కల్యాణ మండపంలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ రావాలని కోరారు. జగన్ ముస్లింలకు అండగా ఉన్నారని, పదవులు ఇవ్వటం దగ్గర నుంచి పథకాలు అమలు చేసే వరకు ఇచ్చిన హామీలు అన్ని నిలబెట్టుకున్నారని వివరించారు. వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పోతీన మహేష్ మాట్లాడుతూ
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముస్లింల ద్రోహులని విమర్శించారు.