Politics4th Nov 12:26 PMSunil Byrisetty1 min read
యథావిధిగానే ఎన్నికలు!
ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. ఎన్నికలను యథావిధిగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో వరదలు క
ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. ఎన్నికలను యథావిధిగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో వరదలు కురుస్తున్న నేపథ్యంలో బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుపాను ప్రభావం, వరదల పరిస్థితులు, పోలింగ్ నిర్వహణకు ఎదురవుతున్న ఇబ్బందులపై సమీక్షించారు. చాలా జిల్లాల్లో వరదలు తగ్గుముఖం పట్టాయని, ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు లేవని కలెక్టర్లు నివేదించారు. కలెక్టర్ల నివేదికలను పరిశీలించిన అనంతరం, పరిస్థితులు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేయాలని SEC అధికారులను ఆదేశించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు కొనసాగనున్నాయి.