Politics5th Aug 01:29 PMSunil Byrisetty1 min read
విద్యుత్ సర్దుబాటు పేరుతో సర్దుపోటు
విద్యుత్ సర్దుబాటు పేరుతో ప్రజల మీద కూటమి ప్రభుత్వం విధిస్తున్నది సర్దుపోటు అని ఏపీ కాంగ్రెస్ అధినేత వైయస్ షర్మిల మండిపడ్డారు. చార్జీలు పెంచేది లేదంటూనే జనాలకు చంద్రబాబు షాకుల మీద
విద్యుత్ సర్దుబాటు పేరుతో ప్రజల మీద కూటమి ప్రభుత్వం విధిస్తున్నది సర్దుపోటు అని ఏపీ కాంగ్రెస్ అధినేత వైయస్ షర్మిల మండిపడ్డారు. చార్జీలు పెంచేది లేదంటూనే జనాలకు చంద్రబాబు షాకుల మీద షాకులు పెడుతున్నారన్నారు. అవి ట్రూ అప్ ఛార్జీలు కాదు..సామాన్యుడిని నడ్డి విరిచే ఛార్జీలని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం నెత్తిన మీరు పెడుతున్నది గుదిబండ అని, ఇప్పటికే రూ.17 వేల కోట్ల భారాన్ని మోపారని వ్యాఖ్యానించారు. ఇది చాలదన్నట్లు మరో రూ.12 వేల కోట్ల మేర అధిక భారాన్ని మోపాలని చూడటం దుర్మార్గమని ఖండించారు. ట్రూ అప్ చార్జీల వసూళ్లపై విద్యుత్ నియంత్రణ మండలి ప్రజా అభిప్రాయం సేకరిస్తుంటే.. కూటమి ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కరెంటు ఛార్జీల వీర బాదుడులో జగన్‌కు చంద్రబాబు వారసుడని ఎద్దేవా చేశారు. కూటమిని గెలిపిస్తే ఒక్క రూపాయి పెంపు ఉండదని, ఛార్జీల్లో 30 శాతం తగ్గిస్తామని గొప్పలు చెప్పారని, అధికారంలోకి వచ్చాక 14 నెలల్లోనే రూ.30 వేల కోట్ల సర్దుబాటు భారాన్ని జనం నెత్తిన పెడుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.