Politics20th Mar 01:38 PMSunil Byrisetty1 min read

మన దగ్గరే నేరస్థులైన ప్రజాప్రతినిధులు ఎక్కువ

నేర చరిత్ర గల ఎమ్మెల్యేల శాతంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో వుండడం శోచనీయమని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి వ్యాఖ్యానించారు. అసోసియేషన్ ఫార్ డెమ

మన దగ్గరే నేరస్థులైన ప్రజాప్రతినిధులు ఎక్కువ
నేర చరిత్ర గల ఎమ్మెల్యేల శాతంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో వుండడం శోచనీయమని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి వ్యాఖ్యానించారు. అసోసియేషన్ ఫార్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం 79 శాతం MLAల నేర చరిత్రతో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో నెంబర్ వన్ స్థానంలో, 69 శాతంతో కేరళ 2 వ స్థానంలో, 68.5 శాతంతో తెలంగాణా 3వ స్థానంలో వున్నాయన్నారు. బీహార్, ఉత్తర ప్రదేశ్లో కంటే నేర చరిత్ర గల MLA ల శాతం మన రాష్ట్రంలో ఎక్కువగా వుండడం గమనార్హమన్నారు. జాతీయ స్థాయిలో MLAల సగటు ఆస్తి రూ. 17.92 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్లో రూ. 65.07 కోట్లతో మొదటి స్థానంలో ఉందన్నారు. జాతీయ స్థాయిలో టాప్ 10 మంది ధనవంతులైన MLAలలో నల్గురు మన రాష్ట్రం వారేనన్నారు. రూ. 931 కోట్లతో చంద్రబాబు 5వ స్థానంలో, మంత్రి నారాయణ రూ. 824 కోట్లతో 6వ స్థానంలో, జగన్ రూ. 757 కోట్లతో 7వ స్థానంలో ఉన్నారన్నారు. దీన్ని బట్టి చూస్తే మన రాష్ట్రంలో సామాన్యులకు,మధ్య తరగతి వారికి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశాలు ఏ మాత్రం లేనట్లు స్పష్టమవుతోందని తులసీ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Dr. Narreddy Tulasi Reddy
Andhra Pradesh
Telangana
MLAs
Scroll for the next article