Politics7th Apr 09:20 AMSunil Byrisetty1 min read

పేరుకు రైజింగ్ స్టేట్.. వైద్య సేవలకు దిక్కులేదు!

ఆంధ్రా రైజింగ్ స్టేట్ అని చెబుతున్న ప్రభుత్వం పేదవాడి ఆరోగ్యాన్ని అందని ద్రాక్షగా చేసిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానిది అంతులేన

పేరుకు రైజింగ్ స్టేట్.. వైద్య సేవలకు దిక్కులేదు!
ఆంధ్రా రైజింగ్ స్టేట్ అని చెబుతున్న ప్రభుత్వం పేదవాడి ఆరోగ్యాన్ని అందని ద్రాక్షగా చేసిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానిది అంతులేని నిర్లక్ష్యమన్నారు. ఆరోగ్య శ్రీ సేవల కింద రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటన్నారు. 9 నెలలుగా పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయకుండా.. వైద్య సేవలు ఆపేదాక చూడటం అంటే.. ఆరోగ్యశ్రీ పై సర్కారుకున్న చిత్తశుద్ది ఏంటో అర్థమౌతుందన్నారు. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే ఇదంతా అని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీగా మారిందన్నారు. వైద్య సేవలను విస్తృత పరుస్తామని.. వైద్యానికి గ్లోబల్ సిటీగా చేస్తామని.. గొప్పలు చెప్పే చంద్రబాబు.. ముందు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలిచి, తక్షణం వైద్య సేవలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పేదవారి ఆరోగ్యానికి సంజీవనిలా మారిన ఆరోగ్య శ్రీ పథకానికి.. ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని.. కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
YS Sharmila Reddy
Public Health
Arogyasri
ఆరోగ్య శ్రీ సేవల
పేదవారి ఆరోగ్యా వైద్య సేవలు
Scroll for the next article