News5th Jun 01:41 PMSunil Byrisetty1 min read

డీఎస్సీపై అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన: వైయస్ షర్మిల

డీఎస్సీపై అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అన్నారు. రేపటి నుంచి పరీక్షలు నిర్వహించడం కరెక్ట్ కాదంటున్నారన్నారు. నోటిఫికేషన్, పరీక్ష

డీఎస్సీపై అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన: వైయస్ షర్మిల
డీఎస్సీపై అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అన్నారు. రేపటి నుంచి పరీక్షలు నిర్వహించడం కరెక్ట్ కాదంటున్నారన్నారు. నోటిఫికేషన్, పరీక్ష సమయానికి మధ్య 45 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారన్నారు. ఇది మెగా DSC కాదు దగా DSC అని వాపోతున్నారని తెలిపారు. కనీసం 90 రోజులు ప్రిపరేషన్ గడువు ఉండాలని, 45 రోజుల్లో సిలబస్ మొత్తం చదవలేమని, మూడున్నర లక్షల మంది DSC అభ్యర్థుల పట్ల కనికరం చూపాలని, లేఖల మీద లేఖలు మీకు రాస్తుంటే, కనికరించకపోవడం, నిరుద్యోగుల మొరను పెడచెవిన పెట్టడం అంటే.. కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా డీఎస్సీ వాయిదా వేయాలని చూసే రాజకీయ కుట్రగా మీరు మాట్లాడటం.. మీ తొందర పాటు నిర్ణయానికి అద్ధం పడుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన డీఎస్సీ నిర్వహణలో పరీక్ష రాసే అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని షర్మిల తెలిపారు.
Andhra Pradesh news
Ys sharmila
Nara lokesh
DSC Postpone
DSC preparation time
డీఎస్సీ వాయిదా వేయాలని చూసే రాజకీయ కుట్ర
పరీక్ష సమయానికి మధ్య 45 రోజులు మాత్రమే గడువు
Scroll for the next article