News28th Sep 05:22 PMSunil Byrisetty1 min read
CEC శ్రీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: ఏపీసీసీ
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో అవకతవకలు, అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపు, ఓటర్ల నమోదు ప్రక్రియలో మార్పులు, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతపై లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఎన్నికల సంఘం పత్రాధారా
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో అవకతవకలు, అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపు, ఓటర్ల నమోదు ప్రక్రియలో మార్పులు, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతపై లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఎన్నికల సంఘం పత్రాధారాలతో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఏఐసీసీ ఆదేశాల మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి గారి పిలుపుతో విజయవాడలో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జె.డి. శీలం,షేక్ మస్తాన్ వలీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొలనుకొండ శివాజీ, రాష్ట్ర వ్యాప్తంగా వున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ఓటర్ల జాబితా నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ఎన్నికల కమిషనర్ల స్థాయిలో నమోదైనట్లు పేర్కొంటున్న 14 అభ్యంతరాలపై ఫైల్ నోటింగ్స్, మినిట్స్, Action Taken Reportలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల సంఘం పనితీరుపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. నిరసన అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి పై అంశాలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.