News27th Oct 03:10 PMSunil Byrisetty1 min read
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీసీపీడీసీఎల్ అప్రమత్తం..
విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండాలని అధికారులకు సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశాలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా సర్కిల్, డివిజన్ స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు చేశారు
విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండాలని అధికారులకు సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశాలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా సర్కిల్, డివిజన్ స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు చేశారు. విద్యుత్ సిబ్బంది, అధికారులు ఎవరూ సెలవులు తీసుకోకూడదని సీఎండీ స్పష్టం చేశారు. వర్షాలు, గాలులకు దెబ్బతిన్న తీగలు, స్తంభాల పునరుద్ధరణకు సిబ్బంది, వాహనాలు సిద్ధం చేశారు. తెగిపడిన విద్యుత్ తీగలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ తాకొద్దని విజ్ఞప్తి చేశారు.
ఏపీసీపీడీసీఎల్ కంట్రోల్ రూమ్ నంబర్లు ప్రకటించారు.
1912
కృష్ణా: 6281709355
ఎన్టీఆర్: 9440817561
గుంటూరు: 9440817526
బాపట్ల: 9281413774
ప్రకాశం: 9440817491
పల్నాడు: 7661019447