News24th Oct 05:36 PMSunil Byrisetty1 min read

హెచ్చరికల నేపథ్యంలో ఏపీసీపీడీసీఎల్ సమీక్ష

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తుఫాన్ ప్రభావంతో బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, ఏపీసీపీడీసీఎల్ పరిధిల

హెచ్చరికల నేపథ్యంలో ఏపీసీపీడీసీఎల్ సమీక్ష
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తుఫాన్ ప్రభావంతో బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వ్యవస్థపై సీఎండీ పి. పుల్లారెడ్డి సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు దెబ్బతినే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన సందర్భాల్లో వాటిని సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు అవసరమైన సిబ్బంది, వాహనాలు, మరమ్మతు పరికరాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండాలని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
Scroll for the next article