Telangana14th Aug 05:14 PMSunil Byrisetty1 min read

ప్రపంచంతో పోటీపడాలి: తెలంగాణ డిప్యూటీ సీఎం విక్రమార్క

ప్రపంచంతో పోటీ పడే స్థాయికి APHMEL (ఆంధ్ర ప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్) ఎదగాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంల

ప్రపంచంతో పోటీపడాలి: తెలంగాణ డిప్యూటీ సీఎం విక్రమార్క
ప్రపంచంతో పోటీ పడే స్థాయికి APHMEL (ఆంధ్ర ప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్) ఎదగాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పట్టణానికి సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నంలోని సింగరేణి అనుబంధ సంస్థ APHMELను సింగరేణి సిఎండి బలరాంతో కలిసి సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త పరిశ్రమల విడిభాగాలు తయారీ, పాత విడిభాగాలను మరమ్మతు చేసి సరఫరా చేస్తున్న ఇంజనీరింగ్ సంస్థలకు APHMEL కన్నా మించి మిషనరీ, మానవ వనరులు లేవని అన్నారు. సంస్థలో పనిచేసే అధికారులు, కార్మికులకు కావాల్సింది నిబద్ధత, ప్రపంచంతో పోటీ పడగలం అన్న ఆలోచన, ఉన్న వ్యవస్థను సక్రమంగా వాడుకోవడం ఎలా అన్న తపన అని, అవి ఉంటే ప్రపంచంతో పోటీ పడగలమని భరోసా కల్పించారు. ఈ సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే ఒక కన్సల్టెన్సీ ని నియమిస్తాం వారు స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక ఇస్తారని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా ఏ తరహాలో ముందుకు పోవాలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాం అన్నారు.
APHMEL
Bhatti Vikramarka
Singareni Collieries
Vijayawada
global competition
Telangana Deputy CM
machinery manufacturing
భట్టి విక్రమార్క మల్లు
సింగరేణి
పరిశ్రమల అభివృద్ధి
Scroll for the next article