Education19th Mar 10:41 AMSunil Byrisetty1 min read
సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 146 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ
వైద్య విద్య సంచాలకులు(డిఎంఇ) పరిథిలోని ఆసుపత్రుల్లో డైరెక్ట్, లేటరల్ ఎంట్రీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ కి ఈనెల 26న వాకిన్ ఇంటర్వ్యూకి అర్హులైన అభ్యర్ధులను ఆహ్
వైద్య విద్య సంచాలకులు(డిఎంఇ) పరిథిలోని ఆసుపత్రుల్లో డైరెక్ట్, లేటరల్ ఎంట్రీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ కి ఈనెల 26న వాకిన్ ఇంటర్వ్యూకి అర్హులైన అభ్యర్ధులను ఆహ్వనిస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందుకు సంబంధించిన అర్హతలు, ఇతర వివరాల కోసం htps://dme.ap.nic.in మరియు http://apmsrb.ap.gov.in/msrb/.
వెబ్ సైట్లను సంప్రదించాలని సూచించింది.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు విజయవాడలోని హనుమాన్ పేట, ఓల్డ్ జిజిహెచ్ క్యాంపస్ లో ఉన్న డిఎంఇ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వాకిన్ ఇంటర్వ్యూ కు హాజరు కావాలని తెలిపింది.
ఖాళీల వివరాలు
సిటి సర్జరీ విభాగంలో 15, కార్డియాలజీ విభాగంలో 15, ఎండో క్రైనాలజీ విభాగంలో 5, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ లో 9, మెడికల్ అంకాలజీలో 16, నియో నేటాలజీలో 2, నెఫ్రాలజీలో 19, న్యూరో సర్జరీలో 16, న్యూరాలజీ లో 13, పెడియాట్రిక్ సర్జరీలో 5, ప్లాస్టిక్ సర్జరీలో 4, సర్జికల్ అంకాలజీలో 14, యూరాలజీలో 12, వాస్కులర్ సర్జరీలో 1చొప్పున మొత్తం 146 పోస్టులకు వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.