News25th Oct 04:19 PMSunil Byrisetty1 min read

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ఎన్నో దశాబ్దాల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సేవలందించి పదవీ విరమణ చేసిన పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఏపీ ఎన్జీజివో సంఘం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కృషి చేస్తోందని సంఘ రాష్ట్ర అధ్యక్

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
ఎన్నో దశాబ్దాల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సేవలందించి పదవీ విరమణ చేసిన పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఏపీ ఎన్జీజివో సంఘం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కృషి చేస్తోందని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ చైర్మన్ ఏ. విద్యాసాగర్ తెలిపారు. పెన్షనర్ల వయస్సు, ఆరోగ్య అవసరాలు, ఆర్థిక, సాంకేతిక సమస్యలు, పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన అంశాల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. పెన్షనర్లకు హెల్త్ కార్డుల ద్వారా పూర్తిస్థాయిలో నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్ సిటిజన్లకు నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. హెల్త్ కార్డుల ద్వారా అందించే వైద్య సేవలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు నేరుగా ట్రస్ట్‌కు చేరేలా చర్యలు చేపడుతున్నామని, తద్వారా ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపులు వేగవంతమై, ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందని వివరించారు నగదు రహిత వైద్య సేవల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ప్రయోజనం పొందుతారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘ ప్రధాన కార్యదర్శి జె. రాజారావు, ఎన్జీవో నాయకులు పాల్గొన్నారు.
Scroll for the next article