News25th Oct 03:21 PMSunil Byrisetty1 min read

ఏపీఎన్ఆర్టి సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా బీమా

ప్రవాసాంధ్రుల సంక్షేమం అభివృద్ధి, భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టి సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని అందిస్తోంది. ఈ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్

ఏపీఎన్ఆర్టి సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా బీమా
ప్రవాసాంధ్రుల సంక్షేమం అభివృద్ధి, భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టి సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని అందిస్తోంది. ఈ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా విదేశాల్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉద్యోగులు, విద్యార్థులు లబ్ధి పొందవచ్చు. ఉద్యోగులు, వలస కార్మికులు, విద్యార్థుల కొరకు ఈ పథకం ప్రవేశపెట్టబడింది. బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వల్ల మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నారు. ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి https://apnrts.ap.gov.in/insurance వెబ్ సైట్ ను సందర్శించగలరు.
APNRRT Society
Pravasa Andhra Bharosa
Insurance Scheme
Andhra Pradesh Government
Nara Chandrababu Naidu
విదేశాల్లోని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు
విద్యార్థులు
వలస కార్మికులు
ఆర్థిక సహాయం
ప్రమాద బీమా
Scroll for the next article