News4th Apr 05:34 PMSunil Byrisetty1 min read
అమరావతిలో 36 అంతస్తుల ఎన్టీఆర్ ఐకాన్
రాజధాని అమరావతిలో ఆకాశ హర్మ్యాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏపీ రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణానికి ముందడుగు పడింది. ప్రవాసాంధ్రుల కోసం ఏపీఎన్ఆర్టీ సొసైటీ సంస్థ
రాజధాని అమరావతిలో ఆకాశ హర్మ్యాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఏపీ రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణానికి ముందడుగు పడింది.
ప్రవాసాంధ్రుల కోసం ఏపీఎన్ఆర్టీ సొసైటీ సంస్థ 'ఎన్టీఆర్ ఐకాన్' పేరుతో మూడు దశల్లో (5 ఎకరాల విస్తీర్ణం) 36 అంతస్తుల భారీ భవనానికి సంబంధించి ఫౌండేషన్ నిర్మాణానికి టెండర్లు పిలిచింది.
దాదాపు రూ.600 కోట్ల అంచనా వ్యయంతో జంట టవర్లుగా దీన్ని నిర్మించనున్నారు.
ఇందులో నివాస ఫ్లాట్లను, కార్యాలయ ప్రాంతాన్నీ వారికే విక్రయిస్తారు.
ఈ నిర్మాణంతో అమరావతి ప్రాంతానికి మరింత డిమాండ్ పెరగనుంది.
మరోవైపు రాజధాని ప్రాంతాన్ని అనుసంధానిస్తూ పలు ప్రాంతాలకు రహదారుల నిర్మాణం జరగనున్నాయి.