Business Type15th May 11:25 AMSunil Byrisetty1 min read
బీమా రంగంలోకి అపోలో 24/7
వైద్యరంగ దిగ్గజ సంస్థ అపోలో 24/7 కొత్తగా బీమా రంగంలోకి అడుగు పెట్టింది. ఆరోగ్య, జీవిత, సాధారణ బీమా పాలసీలను తమ ఆన్‌లైన్ పోర్టల్, అపోలో ఫార్మసీ విక్రయ కేంద్రాల ద్వారా అందించనుంది.
వైద్యరంగ దిగ్గజ సంస్థ అపోలో 24/7 కొత్తగా బీమా రంగంలోకి అడుగు పెట్టింది.
ఆరోగ్య, జీవిత, సాధారణ బీమా పాలసీలను తమ ఆన్‌లైన్ పోర్టల్, అపోలో ఫార్మసీ విక్రయ కేంద్రాల ద్వారా అందించనుంది.
ఇందుకోసం ప్రస్తుతం 8 బీమా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అపోలో హెల్త్‌కో సీఈఓ మధివనన్ బాలకృష్ణన్ తెలిపారు.
ఏడాదిలో లక్ష పాలసీలను విక్రయించడం ద్వారా, రూ.80 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు.
అపోలో 24/7 నుంచి పాలసీలు తీసుకున్న వారికి అపోలో ఆసుపత్రుల్లో ప్రత్యేక ప్రయోజనాలు అందుతాయని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఓపీడీ కవరేజీని అందుబాటులోకి తెస్తామన్నారు.
త్వరలోనే ఒక ప్రముఖ క్రెడిట్ కార్డు సంస్థతో కలిసి కో-బ్రాండెడ్ కార్డు తీసుకొస్తున్నామని తెలిపారు.
దీని ద్వారా వైద్య పరీక్షలు, ఔషధాల కొనుగోలు, డాక్టర్ సంప్రదింపులు తదితరాలకు రాయితీలు లభిస్తాయని తెలిపారు.