Business Type13th Jun 04:53 PMSunil Byrisetty1 min read

ఐఫోన్ ఎగుమతులు భారీగా పెంచేసిన యాపిల్

అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ నుంచి 'మేడ్ ఇన్ ఇండియా' ఐఫోన్లను భారీగా ఎగుమతి చేస్తోంది. గతంలో భారత్ లో తయారైన ఐఫోన్లను యాపిల్ సంస్థ నెదర్లాండ్స్, యూ

ఐఫోన్ ఎగుమతులు భారీగా పెంచేసిన యాపిల్
అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ నుంచి 'మేడ్ ఇన్ ఇండియా' ఐఫోన్లను భారీగా ఎగుమతి చేస్తోంది. గతంలో భారత్ లో తయారైన ఐఫోన్లను యాపిల్ సంస్థ నెదర్లాండ్స్, యూకే వంటి ఐరోపా దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేసేది. ఇప్పుడు చైనాపై అమెరికా టారిఫ్ లు పెంచడంతో యాపిల్ కూడా అందుకు అనుగుణంగా ప్లాన్ మార్చింది. భారత్‌లో తయారైన ఐఫోన్లను అమెరికాకు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తోంది. ఈ ఏడాది మార్చి నుంచి మే నెల మధ్య భారత్ నుంచి ఎగుమతి అయిన మొత్తం ఐఫోన్లలో ఏకంగా 97 శాతం అమెరికాకే చేరాయి. వీటి విలువ సుమారు 3.2 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 26,600 కోట్లు)గా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లోనే (జనవరి-మే) అమెరికాకు జరిగిన ఐఫోన్ల ఎగుమతుల విలువ 4.4 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 36,600 కోట్లు) చేరింది. ఇది గత ఏడాది (2024) మొత్తం ఎగుమతులైన 3.7 బిలియన్ డాలర్ల రికార్డును మించి ఉంది. యాపిల్ వ్యూహం, భారత ప్రతిష్టాత్మక 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి భారీ ఊతమిస్తోంది.
Made in India iPhones
97 percent of india iphone export
iphones export
India to usa
US China Trade War
భారత్ నుంచి ఐఫోన్ ఎగుమతులు
మూడు నెలల్లో 3.2 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లు యూఎస్‌కు
Scroll for the next article