Mobiles9th Aug 10:50 AMSunil Byrisetty1 min read
ఐఫోన్ 17.. అంచనాలను మించి!
మార్కెట్లో ఎన్ని బ్రాండ్లు, ఎన్నెన్ని మోడల్స్ స్మార్ట్ ఫోన్లు తెచ్చినా ఆపిల్ ఫోన్‌కు ఉండే క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. అందుకే ఆపిల్ యూజర్ల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా 17 సిరీస్ ర
మార్కెట్లో ఎన్ని బ్రాండ్లు, ఎన్నెన్ని మోడల్స్ స్మార్ట్ ఫోన్లు తెచ్చినా ఆపిల్ ఫోన్‌కు ఉండే క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. అందుకే ఆపిల్ యూజర్ల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా 17 సిరీస్ రాబోతోంది. ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబర్ 2025లో లాంచ్ కానుంది. కొత్త A19 బయోనిక్ చిప్, 6.9-అంగుళాల ప్రోమోషన్ డిస్‌ప్లేతో అద్భుతమైన పనితీరుతో ఆకట్టుకోనుంది. 48MP ట్రిపుల్ కెమెరా సిస్టమ్ వీడియో ఎడిటింగ్‌లో AI ఫీచర్లను అందిస్తుంది. 5,500mAh బ్యాటరీ, వైర్‌లెస్ ఛార్జింగ్ వేగంగా రీచార్జ్ చేస్తుంది. దీని ధర రూ.90,000 నుంచి స్టార్ట్ కావచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ ఫోన్ డిజైన్, సాంకేతికతలో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఆపిల్ ఆధిపత్యాన్ని మరోసారి చాటనుంది.