Mobiles10th Sep 09:42 AMSunil Byrisetty1 min read

యాపిల్ 17 సిరీస్ వచ్చేసింది!

టెక్‌ ప్రియులు ఎదురుచూసిన యాపిల్‌ ఐఫోన్‌ 17 సిరీస్‌ ఫోన్లను కంపెనీ లాంచ్‌ చేసింది. ఐఫోన్‌ 17, ఐఫోన్‌ ఎయిర్‌, ఐఫోన్‌ 17 ప్రో, ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ అయిన ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ను యాపి

యాపిల్ 17 సిరీస్ వచ్చేసింది!
టెక్‌ ప్రియులు ఎదురుచూసిన యాపిల్‌ ఐఫోన్‌ 17 సిరీస్‌ ఫోన్లను కంపెనీ లాంచ్‌ చేసింది. ఐఫోన్‌ 17, ఐఫోన్‌ ఎయిర్‌, ఐఫోన్‌ 17 ప్రో, ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ అయిన ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ను యాపిల్‌ పరిచయం చేసింది. వీటితో పాటు న్యూజనరేషన్‌ ఎయిర్‌పాడ్స్‌ ప్రో3, స్మార్ట్‌ వాచ్‌ సిరీస్‌ 11, ఎస్‌ఈ3 వాచ్‌ను యాపిల్‌ విడుదల చేసింది. కొత్త ఫోన్లలో పలు ఏఐ, అధునాతన ఫీచర్లను కంపెనీ ప్రవేశపెట్టింది. లైవ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఫీచర్‌ను పరిచయం చేసింది. అత్యంత నాజూకుగా కంపెనీ దీన్ని తీసుకొచ్చింది. ఐఫోన్‌ 17 సిరీస్‌ ఫోన్ల బేస్‌ స్టోరేజీ 256 జీబీగా ఉంది. 17 సిరీస్‌ అన్ని ఫోన్లు iOS 26 ఆధారంగా పనిచేయనున్నాయి. అన్ని ఫోన్లలో 120Hz రిఫ్రెష్‌ రేట్‌, 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఇచ్చారు. సెరమిక్‌ షీల్డ్‌ 2 ప్రొటెక్షన్‌ ఇచ్చారు. గత ఐఫోన్లతో పోలిస్తే కొత్త ఫోన్లలో ఉత్తమ బ్యాటరీ బ్యాకప్‌ ఉండనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. 20 నిమిషాల ఛార్జింగ్‌తో 50 శాతం వరకు బ్యాటరీ నిండనున్నట్లు యాపిల్‌ పేర్కొంది. సెప్టెంబర్‌ 12 నుంచి ముందస్తు ఆర్డర్‌లు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 19 నుంచి మార్కెట్‌లో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ తెలిపింది. ఐఫోన్‌ 17లో 6.3 అంగుళాల డిస్‌ప్లే ఇచ్చారు. 3ఎన్‌ఎం A19 యాపిల్‌ సిలికాన్‌ చిప్‌ అమర్చారు. ఎక్స్‌డీఆర్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇచ్చారు. వెనకవైపు రెండు 48 ఎంపీ డ్యూయల్‌ ఫ్యూజన్‌ కెమెరాలు ఇచ్చారు.
Smartphone
Apple Launch
iPhone 17 Pro Max
iPhone 17 Air
AI Features
iOS 26
AirPods Pro 3
Apple Watch Series 11
SE 3 Watch
OLED Display
120 Hz Refresh Rate
Ceramic Shield 2
Fast Charging
Scroll for the next article